01-03-2025 10:13:45 PM
కడ్తాల్,(విజయక్రాంతి): మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులు స్వపరి పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా శశి, కలెక్టర్ గా ధనుష్ కుమార్, డీఈవోగా సాయి దీప్తి, ఎంఈఓగా వర్షిని, కొంతమంది ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఎఎ పీసీ చైర్మన్ కౌసల్య, పాఠశాల హెడ్మాస్టర్ రాజు ఉపాధ్యాయురాలు విజయభారతి, సునీత, సంగీత పాల్గొన్నారు.