calender_icon.png 12 March, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

12-03-2025 01:04:50 AM

నాగల్ గిద్ద, మార్చి 11 : నాగల్ గిద్ద మండలం గంగారాం తండ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు విద్యాబోధన చేసి మెప్పించారు. మంగళవారం  స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యా యులుగా ఎంపిక కాబడిన విద్యార్థులు విద్యార్థులను చక్కటి పాఠ్యాంశ బోధన చేసి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు బోధించి తమదైన ముద్ర వేసుకు న్నారు. ఒక రోజు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తే చక్కగా ఉపాధ్యాయులను అనుసరిస్తూ బోధించారు. 

విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో  జిల్లా విద్యాశాఖాధికారిగా సిహెచ్.గీతా, మండల విద్యాశాఖ అధికారిగా గౌతమ్ ప్రధానోపాధ్యాయులుగా ఆర్. మోహన్,  పిఈటి గా అర్వీంద్  ఉపాధ్యాయులుగా ఆర్.మంజుల, గీతా,ఇందు నిర్వ హించారు. అనంతరం చక్కటి బోధన చేసిన విద్యార్థి ఉపాధ్యాయులను  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసీరావు, ఉపాధ్యాయురాలు మానస, కరస్ గుత్తి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హిరామన్, కారముంగీ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రావు, మాజీ సర్పంచ్ సురేష్ చౌహాన్, పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, నందేవ్,సతీష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.