13-03-2025 07:32:29 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం వెనుక తండా ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వి. కనకయ్య ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని, ఎం ఈ ఓ గా అనిల్, హెచ్ ఎం గా దినేష్, ఉపాధ్యాయులుగా రాకేష్, వరుణ్, సిద్దు, జయేందర్, అనూషలు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి కనకయ్యా, జ్యోతి, అమ్మ కమిటీ చైర్మన్ మంజుల సోమలాల్, పాల్గొన్నారు.