నడిగూడెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని సిరిపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి వారికి తనదైన శైలిలో పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు. అలాగే కలెక్టర్ గా గుండ్లపల్లి ధరణి, డీఈవోగా ఏలుగూరి వెన్నెల, ఎంఈఓ గా నందిగామ శ్రీజ, హెచ్ఎం గా తాల్లూరి మహాలక్ష్మి, విద్యాశాఖ మంత్రిగా షేక్ సానియా పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల ఎంఈఓ , ఎంపీడీవో ఇమామ్, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసి వారిలో ఉత్సహన్ని కలిగించడమే స్వపరిపాలన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్.సతీష్ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు డర్రా ఉపేందర్, ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.