calender_icon.png 10 March, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడి చదివినప్పుడే మంచి మార్కులు సాధ్యం

07-03-2025 04:54:02 PM

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్

చేగుంట,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి శ్రమించి చదివినట్లయితే సర్వం సాధ్యంతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చిన్న శివనూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ అన్నారు.  పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా తాను ప్రసంగించారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాధ్యాయుడికి ఒక ప్రత్యేక స్థానం,గౌరవం ఉందని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళిక బద్ధంగా చదువుకొని తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చు అన్నారు.

ప్రతి విద్యార్థి క్రమశిక్షణ తో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని అన్నారు  ఈ మేరకు పాఠశాలలోని ఉపాధ్యాయులు రాములు, చక్రధర్, సుధాకర్, రాజశేఖర్ రెడ్డి,  రాజశేఖర్, రాజు, తరగతుల నిర్వహణ పర్యవేక్షించడం జరిగింది. తరగతి నిర్వాహన, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు  చక్కగా నిర్వహించిన వారికి పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా ఫర్హాన్ అలీ, ఉపాధ్యాయులుగా అంకిత, శ్రవణ్, నరేందర్, కిరణ్, ఐశ్వర్య, పల్లవి వ్యవహరించారు.