12-03-2025 07:59:59 PM
పాపన్నపేట: మండల పరిధిలోని కొడపాక ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. డీఈఓగా గౌతమి, ఎంఈఓగా సిద్దు, ప్రధానోపాధ్యాయులుగా సాయి ప్రసన్న, ఉపాధ్యాయులుగా జగదీష్, భాను, మానస, షాహిస్తా, జగదీష్, సురేష్, మణితేజ్, నిఖిల్, పోచందర్,రామ్ చరణ్ శ్రీనిధి, అబ్దుల్ రహీం లు వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శాంత కుమారి మరియు ఉపాధ్యాయులు ఎం.వెంకటేశం, సిద్ధిరాములు, సురేష్, డి.వెంకటేశం,మదన్మోహన్, బాల మల్లేష్ లు అభినందించి బహుమతులు అందజేశారు.