04-03-2025 06:31:20 PM
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Chityala Zilla Parishad High School) మంగళవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని(Self-Government Day) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఈవో కోడెపాక రఘుపతి(MEO Kodepaka Raghupathi) హాజరై విద్యార్థుల బోధనను చూసి ముచ్చట పడ్డారు. ప్రధానోపాధ్యాయుడిగా పుల్ల హర్షవర్ధన్, ఎంఈఓగా వెల్దంది సహస్ర, డిఈఓ గా మొగుళ్ళ సాయి చరణ్, తెలుగు పండితుడుగా బుర్ర అభిరామ్ గౌడ్, జడ్జిలుగా తుపాకుల వందన, గడ్డం శంకర్, కుచనపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు.అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పవిత్రమైన బోధనా వృత్తి ఆనందం కలిగించిందని, అందులోని కష్ట సుఖాలను ఈ కార్యక్రమంలో ద్వారా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, సరళాదేవి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, బుర్ర సదయ్య, సుజాత, బుజ్జమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.