04-03-2025 05:06:59 PM
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్
చేగుంట,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి శ్రమించి చదివినట్లయితే సర్వం సాధ్యంతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ అన్నారు. పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో తాను ప్రసంగించారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ నేడు సమాజంలో ఉపాధ్యాయుడికి ప్రత్యేక గౌరవం ఉందని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళిక బద్ధంగా చదువును ఇష్టపడి చదివినట్లయితే తాము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చు అన్నారు . ప్రతి విద్యార్థి క్రమశిక్షణ తో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని కోరారు. అంతకుముందు విద్యార్థులు వారు వేసిన వేషధారణలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులుగా రాంచరణ్, జిల్లా కలెక్టర్ గా సిద్దు, డిప్యూటీ కలెక్టర్ షాదు, డీఈవోగా సందీప్, డిప్యూటీ డి ఈ ఓ గా అక్షయ, ఎంఈఓ గా శ్రీకాంత్, ఉపాధ్యాయులు సానోబార్ నాజ్, తదితరులు పాల్గొన్నారు