calender_icon.png 25 January, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

24-01-2025 07:15:10 PM

హుజూర్‌నగర్: జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుజూర్నగర్ లో విద్యార్థినిలు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. సుమారు 70 మంది విద్యార్థిణులు వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా, 15 మంది అధికారులుగా తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించి అందరి చేత మన్ననలను పొందారు. స్వపరిపాలన దినోత్సవంలో ప్రధానోపాధ్యాయులుగా పదవ తరగతి విద్యార్థిని కీర్తన, జిల్లా కలెక్టర్గా మౌనిక, ఎంపీగా త్రిష, విద్యా శాఖ మంత్రిగా హెమిమా, డీఈవోగా నికిత, ఎమ్మెల్యేగా ఆశ్రీన్ తమ యొక్క విధులను చక్కగా నిర్వహించి పాఠశాల బాధ్యతలను స్వయంగా స్వీకరించి సుపరిపాలనను అందించారు. తదనంతరం వివిధ కేటగిరీలలో బోధించిన ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రద, బాల సాయి లక్ష్మి, శైలజ, విజయ, అపర్ణ, కమలమ్మ, విజయలక్ష్మి, మాధవి, అభిలాష, కరుణ, జీవన, పిడి జనార్దన్ రెడ్డి లు పాల్గొన్నారు.