calender_icon.png 19 April, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీయ బహిష్కరణ చేయండి

11-04-2025 12:44:44 AM

వీసా రద్దయిన భారత విద్యార్థులకు అమెరికా ఆదేశం

వాషింగ్టన్, ఏప్రిల్ 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. షాపుల్లో దొంగతనాలు, వాహనాలు అతివేగంగా నడిపిన కారణంగా విదేశీ విద్యార్థుల వీసాను అమెరికా రద్దు చేసింది. వీరిలో భారతీయులే అధికం. 15 రోజుల్లోపూ వీసా రద్దయిన విద్యార్థులంతా అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా దేశాన్ని వీడకపోతే బలవంతంగా పంపించేందుకు వెనుకాడమని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డీహెచ్‌ఎస్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. ఫలితంగా స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ప్రభావం పడే అవకాశముం ది.

ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోప్రకటించారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వీసా రద్దయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టేనని, అలాంటి వారు తక్షణమే దేశాన్ని వీడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.