calender_icon.png 3 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్

29-03-2025 12:20:56 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మార్చి  28 ( విజయక్రాంతి ) : మహిళా సంఘాల ద్వారా ప్రతి మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఏ.పి.యం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల స్వయం ఉపాధి, సాధికారత కొరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ మహిళా సంఘాలకు చెయుతనిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని వనపర్తి జిల్లాలోని ప్రతి మండలంలో స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పే విధంగా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఎ.పి.యం లను ఆదేశించారు. 

పెట్రోల్ బంక్,  గోదాములు, రైస్ మిల్లు లేదా మరేదైనా వ్యాపారం మొదలు పెట్టే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు  ముందుకు వస్తె జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారాలు అందిస్తామని అవసరమైతే శిక్షణ సైతం ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య పిడి డిఆర్డిఏ ఉమాదేవి డిపిఎం అరుణ ఏపిఎంలు తదితరులు పాల్గొన్నారు.