calender_icon.png 7 November, 2024 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలకు గిరిజన విద్యార్థుల ఎంపిక

07-11-2024 05:28:36 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ లోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థినిలు (అమూల్య, ముత్తుబాయి, అనిత, మౌనిక, ఇంద్రజ, అలేఖ్య, అనలక్మి, పల్లవి) శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరగబోయే ఎస్జీఎఫ్ అండర్ 14 విభాగం తెలంగాణా రాష్ట్ర స్థాయి బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానపాధ్యాయుడు జంగు, జిల్లా ఆశ్రమ పాఠశాలల స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీన రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు తరపున ఆడి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జిల్లా పతాకాన్ని ఎగురవేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని గిరిజన శాఖ డిడి రమాదేవి అన్నారు. ఎంపికైన క్రీడాకారులను ఏసిఎంఓ ఉద్ధవ్, జిసిడివో శకుంతల, కోచ్ లు అరవింద్ విద్యాసాగర్, తిరుమల్, వార్డెన్ సాయిబాబా, ఉపాధ్యాయ బృందం అభినందించారు.