calender_icon.png 19 January, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకలవ్య పాఠశాలలకు ఔట్సోర్సింగ్ లో ఉపాధ్యాయుల ఎంపిక

18-01-2025 05:33:52 PM

ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడపబడుతున్న తెలంగాణ ఏకలవ్య మోడల్ గిరిజన విద్యాలయాల్లో పనిచేయుటకు అర్హులైన తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే తాత్కాలికంగా స్టూడెంట్ కౌన్సిలర్ అవుట్సోర్సింగ్ పోస్టుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్(ITDA Project Officer B.Rahul) ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల విద్యార్హతలు పిజి లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీలో విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడునని అన్నారు. అభ్యర్థులు ఈనెల 20 నుండి 23వ తేదీలోగా తమ దరఖాస్తులను ప్రాంతీయ సమన్వయ అధికారి వారి కార్యాలయము ఐటిడిఏ భద్రాచలం నందు స్వయంగా సమర్పించాలని, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీ పోస్టుల వారీగా ఎంపిక చేయబడతాయని, వివరాల కోసం ప్రాంతీయ సమన్వయ అధికారి వారి కార్యాలయం భద్రాచలం చరవాణి నెంబర్ 9704178525 ద్వారా తెలుసుకోవాలని ఆయన అన్నారు.

అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు నమూనా ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని, బయోడేటా ఫారం ద్వారా సమర్పించకూడదని, అభ్యర్థులు అసంపూర్తిగా లేదా తప్పుడు సమాచారంతో నింపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని, అభ్యర్థులు ఏ విధమైన అననుకూల మార్గాలను అనుసరించిన లేదా నియమాలను పాటించకపోతే ఆ దరఖాస్తులను తక్షణమే తిరస్కరించబడతాయని, పీవో ఐటిడిఏ భద్రాచలం ప్రామాణిక అధికారి అవసరమైనప్పుడు ఖాళీలను పెంచడం లేదా తగ్గించడం, నోటిఫికేషన్ ను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం కలిగి ఉంటారని ఆయన అన్నారు. మొత్తం నాలుగు పోస్టులు కలవని, ఎంపిక కాబడిన అభ్యర్థులు చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, సింగరేణి ఏకలవ్య మోడల్ గిరిజన విద్యాలయాల్లో పనిచేయవలసి ఉంటుందని అన్నారు. గతంలో స్టూడెంట్ కౌన్సిలర్ ఔట్సోర్సింగ్ నిర్వహించిన ఇంటర్వ్యూలు కొన్ని అనివార్య కారణాలవల్ల రద్దు చేయడం జరిగినదని, ఈ విషయాన్ని దరఖాస్తు చేసిన అభ్యర్థులు గమనించగలరని ప్రాంతీయ సమన్వయ అధికారి ఖమ్మం రీజియన్ ఆర్ సి ఓ నాగార్జున రావు తెలిపారు.