calender_icon.png 24 January, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక

24-01-2025 01:04:34 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో  ప్రతిభ కనబరిచిన గోపాల్ ,విక్కీ ఈ నెల 24 నుండి 28 వరకు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో జరగనున్న జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ జూలూరు యాదగిరి వైస్ ప్రిన్సిపాల్లు అబ్దుల్ రహీం, సంతోష్, పిడి శంకర్, పి ఈ టి ప్రసాద్, హౌస్ మాస్టర్ సురేందర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ బాబురావు, అధ్యాపక బృందం అభినందించారు.