calender_icon.png 5 January, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మున్సిపల్ భవన నిర్మాణానికి స్థలం ఎంపిక...

02-01-2025 08:00:15 PM

సంక్రాంతి లోపు జాతీయ రహదారి ట్రెంచ్  కట్టింగ్ పూర్తి చేయాలి

మంంథనిలో పురపాలక కార్యాలయానికి స్థలాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...

పెద్దపల్లి (విజయక్రాంతి): మంథని మున్సిపల్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం కలెక్టర్ మంథని పట్టణంలో పర్యటించి పురపాలక కార్యాలయానికి స్థలాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి ట్రెంచ్ కటింగ్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంథని పట్టణంలో ఓల్డ్ ఎస్సీ హాస్టల్ ను, పట్టణంలోని అందుబాటులో ఉన్న 26 గుంటల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి పురపాలక భవన నిర్మాణానికి అనువైన చోటు ఎంపిక చేయాలని, త్వరలోనే ఐటి పరిశ్రమల శాఖమంత్రిచే పురపాలక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అనంతరం వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణం పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ సంక్రాంతి లోపు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేయాలని, ట్రెంచ్ కటింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని, సంక్రాంతి లోపు సంబంధిత భూములను నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, ఏ.డి.సర్వే ల్యాండ్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.