calender_icon.png 13 January, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణాల ఎంపిక పారదర్శకంగా ఉండాలి

12-10-2024 01:49:19 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్‌యార్డులో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ దుకాణాల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు.

శుక్రవారం సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి సమీకృత మార్కెట్ సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ క్యాటగిరి ప్రకారం అందరికీ లబ్ధి చేకూరాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలను ప్రజలందరికీ అందుబా టులో ఉంచాలన్నారు. ఎమ్మెల్యే వెంట మా ర్కెట్ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.