calender_icon.png 4 February, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్స్ పురుషుల కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

04-02-2025 04:23:18 PM

క్రీడా దుస్తుల పంపిణీ మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు..

మంచిర్యాల (విజయక్రాంతి): అదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 7 వరకు జరుగనున్న 71వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మంచిర్యాల జిల్లా జట్టు మంగళవారం బయలుదేరి వెళ్ళింది. జిల్లా జట్టులో జాన్సన్ (జైపూర్), దీపక్ (వెంకట్రావుపేట), సంగ్రామ్ (బెల్లంపల్లి), విజయ్ (బూరుగుపల్లి), సంజయ్ (చెన్నూర్), విజయ్ (లక్షేట్టిపేట), సాయి ప్రకాష్ (శ్రీరాంపూర్),  రాజ్ కుమార్ (శ్రీరాంపూర్), అక్రమ్ (శ్రీరాంపూర్), సాయి కృష్ణ (మంచిర్యాల), దినకర్  (లక్షేట్టిపేట), మదూకర్ (వెంకట్రావుపేట్) లతో పాటు కోచ్ కార్తీక్( శ్రీరాంపూర్), మేనేజర్ వర్మ (బెల్లంపెల్లి)లు ఉన్నారు. వీరికి మంచిర్యాల సీఐ ప్రమోదరావు, ఎస్ఐ ప్రవీణ్ చేతుల మీదుగా క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ స్టేట్ ఈసీ మెంబర్ కే కార్తీక్, జాయింట్ సెక్రెటరీ రవీందర్, రామచందర్ లు తదితరులు పాల్గొన్నారు.