ఎన్ సిసికి ఎంపికైన విద్యార్థులు
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణ సంవత్సరానికి గాను అరవై మంది కళాశాల విద్యార్థులను యన్ సీసీ కాడెట్లుగా ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సునీత తెలిపారు. తెలంగాణలో 9వ కరీంనగర్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ డానియల్ లోట్జెం ఆధ్వర్యంలో కళాశాల యన్ సీసీ బెటాలియన్ సెలెక్షన్ అధికారులు సుబేదార్ సూర్యప్రసాద్, హావిల్దార్ గులాబ్ సింగ్ ల సమక్షంలో ఎంపిక జరిపినట్లు కళాశాల యన్ సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ భవాని తెలిపారు. 150మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో వారి ఎత్తు, బరువు, శారీరక దారుఢ్యం, క్రీడా సామర్థ్యం వివిధ రకాల కళా నైపుణ్యాల ఆధారంగా 24 మంది బాలికలను, 36 మంది బాలురను ఎంపిక చేసారు.