calender_icon.png 10 March, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంటనే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక

10-03-2025 01:22:26 AM

అవకతవకలకు ఆస్కారం ఉండొద్దు

కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి         

రాష్ట్ర  రెవెన్యూ, హౌసింగ్  శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబం ధించి లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్  శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇండ్ల ని ర్మాణ ప్రక్రియను వేగవంతం చేయలని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆదివారం తన నివాసంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అందుకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలన్నారు. ఈ పథకం అమలులో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో  స్థానిక శాసన సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, కలెక్లర్లే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

అలాగే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.  అసంపూర్తిగా ఉన్న పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు వేసవి దృష్ట్యా సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్,  ఔటర్, ఇన్నర్ రింగు రోడ్డుకు సంబంధించిన భూసేకరణలో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.