26-04-2025 08:06:05 PM
మునిపల్లి: మండలంలోని బుదేరా చౌరస్తాలో గల మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఆల్ ఇండియా అంతర కళాశాల క్రీడా పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి తెలిపారు. ఈ పోటీలు 24న హైదరాబాదులోని నిజాం కాలేజ్ లో నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో కళాశాలకు బీబీఏ గ్రూప్ మొదటి సంవత్సరం చదువుతున్న రెబెకా, జనరల్ గ్రూప్ రెండవ సంవత్సరం చదువుతున్న రాధిక, ఈ గ్రూపు మూడవ సంవత్సరం చదువుతున్న మీనాక్షిలు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. మాధవి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి. రమాదేవి, అధ్యాపక బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.