calender_icon.png 24 November, 2024 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి ఈత పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

24-11-2024 02:18:50 PM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: డిసెంబర్ 7,8 తేదీలలో భూపాలపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లాల ఆక్వాటిక్ , స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ హనుమంత రాజు  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి లోని  సింగరేణి స్విమ్మింగ్ పూల్ లో జరగనున్న ఈ పోటీలకు  కొత్తగూడెం సి ఈ ఆర్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుండి  వివిధ విభాగాల్లో  క్రీడాకారులు ఎంపికయ్యారు. గ్రూప్ వన్ నుండి కే. పవన్, బి.రామ్ సందేశ్, కే.సాయి శ్రీ వాత్సవ్, గ్రూప్ 2 నుండి ఎస్.చత్రపతి నాథ్, కే.కేశవ, ఐ. భగవత్, డి ఆశిష్ విస్లాన్, గ్రూప్ 3  నుండి సి.హెచ్ మోక్ష చంద్రశేఖర రావు, జి. మాన్విక్, ఆర్. జస్వంత్ సాయి సాత్విక్, గ్రూప్ 4 హసన్ చౌదరి కెవిన్ విల్సన్,శ్రీకాంత్,బాలికలు నుండి గ్రూప్ 3  ఎస్. గాయత్రి, సిహెచ్. రక్షిత, గ్రూప్ 5 అమన ప్రియ, ఏకస్వీ లు ఎంపికైనట్లు హనుమంత రాజు తెలిపారు.   రాష్ట్రస్థాయి ఈత పోటీలకు  ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, పోస్నెట్, నరహరి, కోచ్ లు శామ్యూల్, రాంబాబు సంధ్య,సామంత్ లు అభినందించారు.