నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 26 నుంచి అమలు చేయనున్న కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు రైతులకు పెట్టుబడి సాయం తదితర పథకాల ఎంపిక క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అరుల వారందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు.