calender_icon.png 20 January, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి..

20-01-2025 05:15:39 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్...

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయంగా ఇందిరమ్మండ్ల తప్పిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలు అనుమానాలను గ్రామసభల ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పక్షపాతాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, కాషాబోయిన మహేష్, మండల యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.