calender_icon.png 20 January, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి

20-01-2025 04:59:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palwai Harish Babu), ఎమ్మెల్సీ దండ విట్టల్(MLC Danda Vittal) అన్నారు. సోమవారం కౌటాల, సిర్పూర్ టి మండల కేంద్రంలో ఇందిరమ్మ నమూనా గృహా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాస్త్రీయంగా ఇందిరమ్మండ్ల తప్పిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలు అనుమానాలను గ్రామసభల ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పక్షపాతాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లు శ్రీనివాస్, మస్కుర్ అలి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీఓ కోట ప్రసాద్, నాయకులు హర్షద్ హుస్సేన్, రాజేందర్, మోతిరామ్, విజయ్, భీమన్న, సత్యనారాయణ, అశోక్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.