నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, 15 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్ష, ప్రభుత్వ పథకాల అమలు, జిల్లాలో శాంతిభద్రత పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులకు ఆదేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై మాట్లాడారు. ముఖ్యంగా గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.