calender_icon.png 16 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక

16-01-2025 03:33:49 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే గ్రామ సభల్లో ఆమోదం పొందాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..  సాగుయోగ్యంకాని భూములపై క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు.