07-02-2025 12:28:41 AM
కామారెడ్డి ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం క్రీడా పోటీలను నిర్వహించారు. ఎన్ వైకే ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్పోరట్స్ మీట్ ను నిర్వహించారు. క్రీడాకారులకు కబడ్డీ కోకో వాలీబాల్ బ్యాట్మెంటన్ 200 మీటర్ల రన్నింగ్ పోటీలను నిర్వహించారు.
ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ భూలక్ష్మి, ఎస్‌ఎస్‌ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, ఎన్ వై కే వాలంటీర్ సునీల్ రాథోడ్, చిరంజీవి, కృష్ణ, విటల్, తదితరులు పాల్గొన్నారు.