calender_icon.png 19 April, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో చదివి గ్రూప్-1 ఆఫీసర్ గా ఎంపిక కావడం నేటి తరం యువతకు ఆదర్శం..

12-04-2025 04:31:48 PM

పిఆర్టియు ఖమ్మం జిల్లా రథసారథి యలమద్ది వెంకటేశ్వర్లు..

వైరా (విజయక్రాంతి): చదువుకు పేదరికం అడ్డు కాదని, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదగటం అనేది నిజంగా నేటితరం యువతకు ఆదర్శం అని పిఆర్టియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు (వైవి) పేర్కొన్నారు. వైరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ లో సోషల్ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న శిరీష ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాలలో గ్రూప్ వన్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పిఆర్టియు ఖమ్మం జిల్లా శాఖ, వైరా మండల శాఖల ఆధ్వర్యంలో పాఠశాలలో శిరీషని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పిఆర్టియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు (వైవి) హాజరై శిరీషను అభినందించారు. అదేవిధంగా గరికపాడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సత్యనారాయణ మాట్లాడుతూ.. నా శిష్యురాలు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. అనంతరం శిరీషను శాలువాలతో సన్మానించారు. ఆమె కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు వైవి, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డి.సత్యనారాయణ, వైరా మండల అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు ప్రధాన కార్యదర్శి వేమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు నాగబత్తిని స్వప్న, ప్రేమ్ లీలా, పిఆర్టియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు విజయ అమృత కుమార్, ఉపాధ్యక్షులు కట్టా. శేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రెబ్బా శ్రీనువాసరావు, సోమ్లా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.