అధికారులతో కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జనవరి 18 (విజయ క్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కు సంబంధించి లబ్దిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
రైతు భరోసా,రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కొరకు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలన పై శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులు,మండల ప్రత్యేక అధికారులు,మండల నోడల్ అధికారులు,ఎం.పి.డి. ఓ.లు, తహశీల్దార్‌లతో కలెక్టర్ వెబెక్స్ ద్వారా సమీక్షించారు.
రైతు భరోసా కార్యక్రమం కింద వ్యవసాయ యోగ్యమైన భూమి,రేషన్ కార్డుల వెరిఫికేషన్ పై క్షేత్ర స్థాయి పరిశీలన మండలంల వారీగా ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లతో సమీక్షించి సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని రెవెన్యూ గ్రామాలు పూర్తి చేశారు,ఇంకా ఎన్ని గ్రామాలు పూర్తి చేయవలసి ఉంది, రేషన్ కార్డుల వెరిఫికేషన్ ఎంత వరకు పూర్తి చేశారు,ఏమైనా సమస్యలు ఉన్నాయా సమీక్షించారు.
అరులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిచేగరుల చూడాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సమన్వ యంతో పనిచేయాలని తెలిపారు. సాగుకు యేగ్యంగా ఉండే భూములను జాబితా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. రేషన్ కార్డుల కొరకు సమగ్ర కుటుంబ సర్వే లో వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలు పరిశీలన జరిపి అరుల జాబితా రూపొందించాలని ఆదేశించారు.
ఈ నెల 16 నుండి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయిలో పరిశీలన లో ఇంకా మిగిలిన గ్రామాల ను ఈ నెల 20 వరకు పూర్తి చేసి లబ్దిదారుల జాబితా తయారు చేసుకోవాలని అన్నారు. లబ్దిదారుల జాబితా ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే గ్రామసభలలో నాలుగు పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామసభలో వివరించాలని అలాగే లబ్ధిదారుల పేర్లను కూడా ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.