calender_icon.png 30 October, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీకి తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత

14-08-2024 02:18:02 AM

  1. బైక్ సీటు, సైడ్ ప్యానల్స్‌లో 200 క్వార్టర్లు 
  2. జగ్గయ్యపేటలో పట్టుకున్న ఏపీ పోలీసులు

సూర్యాపేట, ఆగస్టు 13: ఏపీకి తరలిస్తున్న తెలంగాణ మద్యంబాటిళ్లను ఏపీలోని జగ్యయ్యపేటలో పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మణికంఠరెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని దోరకుంట గ్రామానికి చెందిన సీమ్మసర్తి రాజు కోదాడలోని వైన్స్ నుంచి తన బైక్ సీటు కింద, సైడ్ ప్యానల్స్, డూమ్‌లలో సుంకం చెల్లించని 200 క్వార్టర్ సీసాలను అమర్చి ఏపీకి తీసుకెళ్లాడు. జగ్గయ్యపేట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు షేర్‌మహ్మద్ పేట్ క్రాస్‌రోడ్డు వద్ద అతడ్ని పట్టుకున్నారు.

కళ్లు చెదిరిపోయేలా 200 క్వార్టర్ సీసాలను బండంతా అమర్చడంతో అవాక్కయ్యారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నందిగామ మండలంలోని అనాసాగరంలో బెల్ట్‌షాప్ నిర్వాహకుడు పెద్దమళ్ల నర్సింహారావుకు సరఫరా చేస్తున్నట్లు తెలసుకున్నారు. మద్యం బాటిళ్లు, బైక్‌తోపాటు రాజును అదుపులోకి తీసుకున్నారు. అలాగే నర్సింహరావును సైతం అదుపులోకి తీసుకున్నారు.