calender_icon.png 22 December, 2024 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.80లక్షల గంజాయి పట్టివేత

03-08-2024 03:12:51 AM

భద్రాచలం, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సార పాక శివారులో శుక్రవారం రూ.80 లక్షల విలువగల 2.50 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక శివారులోగల పుష్కరవనం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు వాహనాల్లో భద్రాచలం నుంచి మణుగూరు ఎక్స్‌రోడ్డు వైపు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. మూడు వాహనాలతో పాటు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా తేలిందన్నారు. 

గంజాయి విక్రేత అరెస్ట్

నిజామాబాద్(విజయక్రాంతి): నిజామాబాద్‌లో గంజాయి అమ్ముతున్న యువకు డ్ని పోలీసులు పట్టుకున్నారు. న్యాల్కల్ రో డ్డులోని అష్టలక్ష్మీ ఆలయం వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో నాల్గో టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న సిర్పూర్ గ్రామానికి చెందిన కమ్మరి శశాంక్‌ను అదుపులోకి తీసుకుని, అతని నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.