calender_icon.png 16 November, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

56 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

19-09-2024 03:05:33 PM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలో 2 చౌక దుకాణాల్లో (రేషన్ షాపులు) అక్రమంగా నిల్వ ఉన్న 56 క్వింటాళ్ల బియ్యాన్ని గురువారం పోలీసులు, సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బేతంపూడి చౌక డిపోలో రేషన్ బియ్యం ను ఆ షాపు డీలర్ తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు తేగలపల్లి ఎస్సై సురేష్ బుధవారం రాత్రి తనిఖీ నిర్వహించారు. ఆ దుకాణాల్లో ఉండాల్సిన నిలవకంటే 9 క్వింటాళ్ల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే మండల పరిధిలోని సులానగర్ రేషన్ షాపులో బియ్యం అక్రమ నిల్వ ఉన్నట్లు అందిన సమాచారంతో తనకి చేయగా 47 క్వింటల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో కలిపి మొత్తం 56 క్వింటాల అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వారిపై 6a కేసు నమోదు చేశారు. ఆ రెండు దుకాణాలకు ఒక్కరే డీలర్ కావటం విశేషం.