08-02-2025 10:57:02 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): వర్ని మండలం మూసరా గ్రామంలో 25 కిట్టల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం... రేషన్ బియ్యంను అక్రమంగా నిర్వహించాలని సమాచారం మేరకు వర్ని మండలంలో నిలువ చేసిన 25 కుంటాల బియ్యం స్థావరంపై అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.