calender_icon.png 19 March, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం పట్టివేత

17-12-2024 01:15:45 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీంలీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో చెంగిచర్ల వద్ద  నిర్వహించిన తనిఖీల్లో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. చెంగిచర్లకు చెందిన తరుణ్‌వర్మ మధ్యప్రదేశ్ నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పలు ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి కారులో 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించిన అనంతరం రాజేంద్రనగర్‌లోని కే సురేందర్‌రెడ్డికి చెందిన కారులో 70 బాటిళ్లు, షేక్‌పేట లో క్రాంతి అనే వ్యక్తి ఇంట్లో 28 మద్యం బాటిళ్లు, ఎస్సార్ నగర్‌కు చెందిన నాగార్జున వద్ద 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.