హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): చెరువులో మట్టిపోస్తున్న లారీలను హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు పట్టుకున్నాయి. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉందా సాగర్ చెరువులో మట్టిపోస్తున్న 4 టిప్పర్లను డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. పోసిన మట్టిని జేసీబీతో చదును చేస్తుండగా డీఆర్‌ఎఫ్ సిబ్బంది పట్టుకుంది.
పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులపల్లి (సమర్‌కుంట) చెరువులో మట్టిపోస్తున్న టిప్పర్‌ను హైడ్రా సిబ్బంది పట్టుకుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలలో మట్టి, గృహ సంబంధ వ్యర్థ పదార్థాలు అక్రమంగా పోసే వారిపై హైడ్రా ప్రత్యేక నిఘా ఉంచినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.