calender_icon.png 5 December, 2024 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

05-12-2024 12:47:56 AM

నాగర్ కర్నూల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి):  అనుమతి లేకుండా దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తాడూరు మండలం పొల్మూ రు శివారులోని వాగులోకి ట్రాక్టర్లు దిగేందుకు ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.  పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ౯ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు కాకుండా  ఓ కాంగ్రెస్  నాయకుడు సెటిల్మెంట్లు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై తాడూరు ఎస్సై గురు స్వామిని వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.