calender_icon.png 25 February, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..

24-02-2025 09:29:00 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను సోమవారం బూర్గంపాడు పోలీసులు సారపాకలో పట్టుకున్నారు. స్థానిక ఎస్సై రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని తాళ్ల గొమ్మూరు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచి సారపాకకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను బూర్గంపాడు పోలీస్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడిన  ట్రాక్టర్ ను సీజ్ చేసి, ట్రాక్టర్ డ్రైవర్ బూరం అర్జున్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.