10-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేకం గా పెట్టినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతా ప్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నవత ట్రాన్స్‌ఫోర్ట్‌లో 45 కేజీల నకిలీ బీటీ విత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు.
బెజ్జూరు మండలానికి చెందిన చంద్రశేఖర్ విజయవాడ నుంచి 45 కేజీల ట్రాన్స్‌ఫోర్ట్ ద్వారా గన్ని సంచిలో రవాణా చేశారు. పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల విలువ రూ.1.57 లక్షలు ఉం టుందని సీఐ తెలిపారు.నకిలీ విత్తనాలను అమ్మి అమాయక రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.