calender_icon.png 29 March, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

247 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

24-03-2025 08:51:02 PM

ఐదుగురు కొనుగోలుదారులు, ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్...

పరారీలో సూత్రధారి..

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని అచ్చులాపూర్, గోపాల్ నగర్ సమీపంలో గల సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యానులో పత్తి విత్తనాలు డంపు చేస్తున్నారని సమాచారం రావడంతో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా సోమవారం మధ్యాహ్నం 247 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్లో మంచిర్యాల డిసిపి భాస్కర్ వెల్లడించారు. అచలాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు కొనుగోలుదారులు, ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

నకిలీ పత్తి విత్తనాల అమ్మకానికి ప్రధాన సూత్రధారి అయిన మనోహర్ రెడ్డితో పాటు మల్లేష్ అనే వ్యక్తి పరారైనట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూమి సారం కోల్పోతుందని తెలిపారు. పంట దిగులు తగ్గి పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతోందని స్పష్టం చేశారు. గ్లైపోసిట్ విత్తనాలు వాడడం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు, పోలీసులు పట్టుకున్న వారిలో శఘ్యం సందీప్, గాడి పల్లి సత్యనారాయణ, భోగె సాయికుమార్, మైదం నారాయణ, పొట్లపల్లి రమేష్, కుంచ వెంకటేష్, కోడిపెల్లి సత్యం, పుష్పల తిరుపతిలు ఉన్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, ఎస్సై కిరణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.