14-04-2025 10:18:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు కారులో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, మూడు బస్తాల్లో రవాణా చేస్తున్న 53 లక్షల రూపాయల విలువైన 106 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు తెలిపారు. ఒరిస్సా కు చెందిన ముగ్గురితో పాటు మరిపెడ మండలం తండ ధర్మారం కు చెందిన భానోత్ మహేందర్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు కురవి ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా వారు పట్టుబడ్డారని డిఎస్పి తెలిపారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై గండ్రాతి సతీష్, సిబ్బందికి ప్రోత్సాహక బహుమతి అందించడంతోపాటు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.