calender_icon.png 23 March, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

121 కిలోల ఎండు గంజాయి పట్టివేత

22-03-2025 08:48:18 PM

ఇద్దరు అరెస్టు... పరారీలో ఏడుగురు కారు స్వాధీనం...

విలేకరుల సమావేశంలో పాల్వంచ డి.ఎస్.పి సతీష్ కుమార్ వెల్లడి..

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల శివారులోని సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వాహన తనిఖీల్లో 121 కిలోల గంజాయి పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. శనివారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. శనివారం 11.30 గంటల సమయంలో ఎస్సై రాజేష్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా సమ్మక్క, సారలమ్మ గద్దెల అనుమానాస్పందంగా కనిపించడంతో తనిఖీ చేయగా గంజాయితో సారపాకకు చెందిన కారు డ్రైవర్ వాంకుడోతు సాయికుమార్, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పోలిపాక గ్రామానికి వంశీలు పట్టుబడ్డారు.

వారిని పట్టుకుని విచారించగా పాత గంజాయి కేసులో ఉన్న షేక్ మున్వర్, రమేష్, కత్వాల సురేష్, జగదీష్, స్వరూప్ లు గంజాయి వ్యాపారం చేయాలని భావించి సాయికుమార్ బాబాయి వాంకుడోత్ సురేష్ తో కలిసి భద్రాచలంలో కారును అద్దెకు తీసుకుని పోలిపాక వెళ్లి అక్కడ గంజాయిని ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని మోటుకు వెళ్లి కలిమెలకు చెందిన భీమ వద్ద 55 ప్యాకెట్ల 121.140 కిలోల గంజాయిని కొని కారులో పోలిపాక వచ్చి సాయికుమార్ వాళ్లను అక్కడ దింపి కారులో కుక్కునూరు మండలం వింజరంకు వచ్చి ఉండగా మిగిలిన వాళ్లు పడవ సహాయంతో గోదావరి దాటి వచ్చి ఆ గంజాయిని కారులో పెట్టుకుని సాయికుమార్, వంశీలు వస్తుండగా వాహన తనిఖీల్లో కారుతో సహా పట్టుబడినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉండగా మిగిలిన ఏడుగురు పరారైనట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60.57లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ సతీష్, ఎస్సై రాజేష్ తో పాటు సీసీఎస్ ఎస్సైలు  ప్రవీణ్ కుమార్, రామారావు, ట్రైనీ ఎస్సై దేవసింగ్, హెడ్ కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు.