calender_icon.png 7 October, 2024 | 5:55 AM

రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

07-10-2024 01:37:07 AM

భోపాల్‌లో వెలుగు చూసిన ఘటన

భోపాల్, అక్టోబర్ 6: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ కర్మాగారంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడులు నిర్వ హించి ఏకంగా రూ.1,814 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకోగా ఆదివారం వెలుగు చూసింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి దాడులకు సంబంధించిన వివ రాలు వెల్లడించారు.

భోపాల్‌లోని మహిపాల్‌పూర్ పారిశ్రామిక ప్రాం తంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుందని సమాచారం అం దుకున్న గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీ ఎన్‌సీబీ అధికారులు పక్కాగా నిఘా పెట్టారు. ఓ గోదాములో దాడులు నిర్వహించారు. 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వారు స్వాధీనం చేసుకున్నది పూర్తిగా ముడిసరుకు కాగా, దాని విలువ రూ. 1,814 కోట్లు ఉంటుందని తెలిసింది. కొకైన్, హైడ్రోపోనిక్ గంజాయి ప్రాసెసింగ్ చేసి అమ్మితే దాని మార్కెట్ విలువ సుమారు రూ.5,620 కోట్ల వరకు ఉంటుందని అంచనా.