ఎయిర్‌పోర్టులోబ్యాంకాక్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్
రాజేంద్రనగర్, నవంబర్ 1: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ (డైరెక్ట రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున అధికారు లు ఎయిర్‌పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టా రు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తని ఖీ చేయగా, వారి బ్యాగుల్లో 7.096 కిలోల హైడ్రోఫోలిక్ వీడ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎండీఎంఏ డ్రగ్స్ విక్రేత..
శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 155 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన కృష్ణారామ్ అనే వ్యక్తి గురువారం రాత్రి శేరిలింగంపల్లి గుల్మోహర్‌లో స్టీల్ వ్యాపారం చేసే తన గ్రామానికి చెం దిన రూపారామ్ ఇంటికి వచ్చాడు. అయితే, అతడు తీసుకొచ్చిన బ్యాగుపై అనుమానం వచ్చిన రూపారామ్.. కృష్ణారామ్ స్నానం చేసేందుకు వెళ్లగానే బ్యాగును తనిఖీ చేయగా డ్రగ్స్ కనిపించాయి.
దీంతో వెంటనే చందానగర్ పోలీసులకు, నార్కోటిక్ డ్రగ్స్ అధికారులకు సమాచారం అందించాడు. రూపారామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు కృష్ణారామ్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు 155 గ్రాముల ఎండీ ఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.