- రూ. 60 లక్షల విలువైన అల్ఫాజోలం స్వాధీనం
- తెలంగాణ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అల్ఫాజోలం అమ్మకాలు
- వివరాలు వెల్లడించిన సంగారెడ్డి ఎస్‌పీ రూపేష్
సంగారెడ్డి, జనవరి 11 (విజయక్రాం తి) : నిషేధిత అల్ఫాజోలం అమ్మకం చేసి కోట్లు గడిస్తున్న ముఠాను పట్టుకుందామని సంగారెడ్డి ఎస్పి చెన్నూరు రూపేష్ తెలిపా రు. శనివారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో వివరాలు తెలిపారు.
డిసెంబర్ 31న గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహ నాలు తనిఖీ చేసిండగా ఓ అనుమానితుని అదుపులోకి తీసుకొని విచారించగా డ్రగ్స్ ముఠా వివరాలు బయటకు వచ్చాయన్నా రు. మెదక్ పట్టణం కు చెందిన సుధీర్ గౌడ్ అల్ఫాజోలం డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ గౌని సుధీర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పటాన్‌చెరువు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నా రన్నారు.
అధిక డబ్బు సంపాదించాలని దురాశతో 2014లో సుధీర్ గౌడ్ భార్య శ్రీవాణి తమ్ముడు ప్రభు గౌడులు కమిషన్కు కలలో కలిపే అల్ఫాజోలం మత్తు పదార్థా లు అమ్మడం ప్రారంభించారన్నారు. మత్తు పదార్థాలు అమ్మడంలో అనుభవం ఉండ డంతో 2017లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ తో పరిచయం ఏర్పడి మత్తు పదార్థాలు అమ్మడం ప్రారంభించారన్నా రు.
2020లో గుమ్మడిదలకు చెందిన సా యిగౌడ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకొని అల్ఫాజోలం అమ్మడం ప్రారం భించారన్నారు. ఒరిస్సాకు చెందిన విశ్వేశ్వ ర్ సింగుకు అల్ఫాజోలం తయారీలో అను భవం ఉండడంతో సొంతంగా తయారుచేసి అధిక డబ్బులు సంపాదించవచ్చని ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేశారన్నారు.
2023 లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లా పూర్ మెట్‌లో బాచారం గ్రామంలో సర్వే నెంబర్ 39 లో గల లక్ష్మణ్ గౌడ్ సాయి ప్రియ కెమికల్స్ కంపెనీని కొనుగోలు చేశా రన్నారు. పటాన్ చెరువు మండలం ము త్తంగిలో నివాసం ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారి విశ్వేశ్వర్ సింగుతో పరిచయం ఏర్పాటు చేసుకొని వ్యాపారం ప్రారంభిం చారన్నారు.
లక్ష్మణ్ గౌడ్ కంపెనీ కొను గోలు చేసి బట్టి కంపెనీలో నిషేధిత అల్ఫా జోలం తయారు చేయడం ప్రారంభించార న్నారు. ఒక్క మ్యాలో 50 కిలోల చొప్పున నెలకు ఒకటి రెండు బ్యాలో అల్ఫాజోలం తయారుచేసి కిలో నాలుగు లక్షల చొప్పున హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి జిల్లాలో అన్ని అధిక డబ్బులు సంపాదించారన్నారు .
ముఠాగా ఏర్పడి అమ్మకం..
మెదక్ పట్టణానికి చెందిన గిర్మ గౌని సుధీర్, ఒరిస్సాకు చెందిన విశ్వేశ్వర్ సింగ్, పటాన్ చెరువు మండలం ముత్తంగి చెందిన రాజేశ్వర శర్మ జోషి, శ్రీవాణి, బోడ శేషు కుమార్, ప్రభు గౌడ్, వటపల్లి సంగమేశ్వర్ గౌడ్, సాయిగౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, తోట రాజశేఖర్, సుధాకర్ మత్తుపదా ర్థాలు అమ్మడం ప్రారంభించారన్నారు. వీరితోపాటు అశోక్ గౌడ్, లింగన్న గారి నారాయణమూర్తి గౌడ్, డాలరి సాయిలు వ్యాపారం ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటివరకు ౮ మందిని అరెస్టు చేశామని, 9 మంది పరారీలో ఉన్నారని తెలిపారు.
గుమ్మడిదలలో వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ ముఠా బహిర్గతం
గుమ్మడిదల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి సైకిల్ మోటార్ పై డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్లాపూర్‌మెట్ లో మెడికల్ కంపెనీ పేరు తో అనుమతులు తీసుకొని డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలి పారు.
డ్రగ్స్ అమ్మకాలు చేసి ముఠా ప్లా ట్లు, విల్లాలు భూములు కొనుగోలు చేశార ని చెప్పారు. పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ శివకుమార్, జి న్నారం ఇన్స్‌పెక్టర్ నయీముద్దీన్, గుమ్మ డిదల ఎస్సు మహేశ్వర్ రెడ్డి, సిసిఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ముఠాను పట్టుకున్నా వారిని ఎస్పీ రూపేష్ అభినందించారు.