చైనా నుంచి పాక్‌కు సరఫరా
న్యూఢిల్లీ, జూలై 12 : చైనా నుంచి భారత్ గుండా పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్న నిషేధిత రసాయ నాలను తమిళనాడు పోర్టులో భార త భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. టియర్ గ్యాస్ తయా రీలో ఉపయోగించే వీటి ఎగుమతులపై అంతర్జాతీయంగా నిషేధం ఉం దని అధికారులు తెలిపారు. చైనా సాయంతో పాకిస్థాన్ ప్రమాదకర రసాయన, జీవాయుధాల తయారీ చేస్తోందని ఆరోపించారు. చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్థాన్‌లోని ఓ రక్షణ ఉత్పత్తుల సరఫరా కంపెనీకి ‘ఆర్థో క్లోరో బెంజిలిడిన్ మలో నోనిట్రైల్’ అనే రసాయనాన్ని చేరవేస్తుం డగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ 2,560 కిలోల సరుకును 103 డ్రమ్ముల్లో నింపి ఏప్రిల్ 18న షాంఘై నౌకాశ్రయంలో ఓ వాణిజ్య నౌకలో లోడ్ చేశారు. కరాచీకి బయలుదేరిన ఆ నౌక మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు వీటిని పట్టుకున్నారు.