calender_icon.png 21 February, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

19-02-2025 12:32:37 PM

రెవెన్యూ,పోలీసులు అధికారుల ఉక్కుపాదం. 

అధికారులకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపులు? 

"విజయ క్రాంతి" కథనానికి స్పందన 

చిట్యాల,(విజయక్రాంతి): ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం పట్టుకున్నారు. అయితే  గత పది రోజుల క్రితం "విజయ క్రాంతి" దినపత్రికలో"అడిగేది ఎవరు ? అడ్డుకునేది ఎవరు ? శీర్షికన అక్రమ ఇసుక రవాణాపై కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన  అధికారులు గత పది రోజుల నుంచి ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడానికి పకడ్బందీ చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేని మూడు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఇసుక ట్రాక్టర్ల యజమానులకు కొమ్ముకాస్తున్న కొంతమంది వ్యక్తులు అదికారులను బెదిరిస్తున్నారని..? విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదిలేదని  ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నారు.