12-03-2025 01:12:21 AM
శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు
ఖమ్మం, మార్చి 11 ( విజయక్రాంతి ): ఖమ్మం లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో సోమ, మంగళవారాల్లో ఐటీ అధికారుల ఆకస్మిక సోదాలు చేసి, పలు కీలక డాక్యుమెంట్లను, కొంత నగదును సీజ్ చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం నుంచి అర్దరాత్రి వరకు సోదాలు జరిపిన ఐటీ అధికారులు, మంగళవారం కూడా సోదాలు చేశారు.
పన్ను ఎగవేతకు శ్రీచైతన్య విద్యాసంస్థలు పాల్పడ్డాయన్న విశ్వసనీయ సమాచారంతో ఏకకాలంలో విస్తృతంగా దాడులు చేశారు.విద్యార్థుల నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో ఫీజులు వసూళ్లు చేసి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు ఢీల్లీ, పూణే, చెన్నై లోని శ్రీచైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్బంగా పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు, ల్యాప్ ట్యాప్ లు సీజ్ చేసినట్లు తెలిసింది. ఒక్కో బ్రాంచ్ లో జరిగిన అడ్మీషన్లు, వసూళ్లు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.కాగా ఐటీ అధికారుల ఆకస్మిక సోదాలతో యాజమాన్యం బెంబేలు ఎత్తిo ది.పూర్తి వివరాలు తెలి యాల్సి ఉంది.