calender_icon.png 17 April, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకుతండాలో ఘనంగా సీత్లా భవాని పండుగ వేడుకలు

08-04-2025 04:36:27 PM

పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకుతండా గ్రామంలో సీత్లా భవాని పండుగ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామానికి చెందిన లంబాడా కులస్తులు డప్పు చప్పుళ్లు, మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. సీత్లా భవాని దేవాలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు.

సీత్లా భవాని పండుగను ప్రతి ఏటా లంబాడా, బంజార కులస్తులు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం గ్రామంలోని లంబాడా కులస్తులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, టేకుమట్ల మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.