జయశంకర్ భూపాలపల్లి (ములుగు), ఆగస్టు 3 (విజయక్రాంతి): బండగుల్లపల్లి గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు గత ౨ రోజుల క్రితం విషపురుగు కాటుకు గురై అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సీతక్క శనివారం గురుకులాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తరగతి గదులను, డార్మెంటరీ హాల్, వంట గదిని ఆమె పరిశీలించారు. విద్యార్థులతో మాట్లా డి సమస్యల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు రాత్రివేళలో బయటకు రావద్దని మంత్రి సూచించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రహరీ, డైనింగ్ హాల్‌తో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెం ట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా, మండల నాయకులు ఉన్నారు.