calender_icon.png 19 September, 2024 | 6:57 AM

గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై సీతక్క వీడియోకాన్ఫరెన్స్

06-09-2024 05:33:07 PM

హైదరాబాద్: గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై రాష్ట్ర శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ  మంత్రి సీతక్క వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి తదితర అంశాలపై సమీక్షించారు. పిల్లల ఆరోగ్యం పట్ల వార్డెన్లు, టీచర్లు, సిబ్బంది మరింత  ప్రత్యేక జాగ్రత్తగా  వహించాలని మంత్రి సూచనలు చేశారు. మనవత్వాన్ని జోడించి మంచి నాణ్యమైన సేవలను అందించాలన్న సీతక్క హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని హితవు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరికలు జారీ చేశారు. గురుకులాల్లో చిన్న సమస్యల్ని పెద్దగా చూపే ప్రయత్నం జరుగుతోందని, కొందరు పని గట్టుకోని మరి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నారని సీతక్క ఆరోపణలు చేస్తున్నారు.